Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను రాణించడానికి కోహ్లీ సాయపడ్డాడు: చాహెల్‌

  • విరాట్‌ కోహ్లీ నాకు స్ఫూర్తినిచ్చాడు
  • మైదానంలోనే కాకుండా ఇతర విషయాల్లోనూ సాయపడ్డాడు
  • నేను ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడు
అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిన యుజువేంద్ర చాహెల్‌.. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మ్యాచుల్లోనూ విరాట్‌ కోహ్లీ టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్‌ కోహ్లీ తనకు స్ఫూర్తినిచ్చాడని అన్నాడు.

మైదానంలోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా తను ఎంతో సాయపడ్డాడని అన్నాడు. తన జీవితం ఇప్పుడు మారిపోయిందని, ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడని పేర్కొన్నాడు. తనకు ఇప్పుడు ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత తెలిసిందని చాహెల్‌ అన్నాడు.
Virat Kohli
chahel
Cricket

More Telugu News